వెబ్ న్యూస్, బతుకమ్మ : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తటస్థ వేదిక దుబాయ్ లో జరుగుతున్న దాయాదుల పోరుకు రెండు దేశాల అభిమానులకు స్టేడియం కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా మ్యాచ్ చూసేందుకు ప్రసార మాద్యమాలను ఉపయోగించుకోవడంలో కొత్త రికార్డ్ నమోదైంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తుల కంటే టీవీలలో, సెల్ ఫోన్ లలో, సోషల్ మీడియాలో వీక్షకుల సంఖ్య దాదాపు 60కోట్లు దాటడం విశేషం. ఆదివారం సెలవు దినం కావడంతో క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కు పోయారు. ఈ మ్యాచ్ పై అదే రీతిలో గెలుపోటములపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం.
