నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలోని బంజారాల సమస్యలను వివరించేందుకు గాను టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల ఆధ్వర్యంలోఅల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రెసిడెంట్ భూక్య చంద్రునాయక్ సీ.ఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీ. ఎంను శాలువాతో సన్మానించి బంజారా సమస్యలను పూర్తిగా వివరించడానికి బంజారా నాయకులకు సమయం ఇవ్వాలని కోరగా సీ. ఎం స్పందించినట్లు తెలిపారు. త్వరలో సమయం ఇస్తానని, అప్పుడు రెండు జిల్లాల సమస్యలపై వివరంగా మాట్లాడుకొందామని సీ. ఎం చెప్పినట్లు చంధ్రు వెల్లడించారు. సీ. ఎం ను కలిసిన వారిలో ఐడీసీఎంఎస్ చైర్మన్ భాధవత్ తారాచంద్, జిల్లా గిరిజన, ఆదివాసి సంఘ చైర్మన్, మాజీ ఎం. పీ. పీ ఖేతావత్ యాదగిరిలు ఉన్నారు.
