రుద్రూర్, బతుకమ్మ: ఎమ్మెల్సి ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులందరూ అధికార పార్టీ మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అవగాహన కల్పించారు. ప్రజా ప్రభుత్వం పట్టభద్రులకు, విద్యార్థిని, విద్యార్థులకు ఒక నిబద్ధతతో హామీలన్నీ నెరవేరుస్తున్నందున మన ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, మాజీ జడ్పీటిసి నారోజి గంగారం, ఇందూరు సునీత చంద్రశేఖర్ , పీఏసిఎస్ చైర్మన్ బద్ధం సంజీవ్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్, మండల రైతు సమన్వయ కన్వీనర్ అడప సాయిలు, ఇందూర్ కార్తీక్ , కర్క అశోక్, షేక్ నిస్సార్ , గొల్ల పవన్, పార్వతి ప్రవీణ్, పోతారాజ్ లింగయ్య, బర్ల చిట్టి, దుర్కి సాయికుమార్, ఫుర్ఖన్, సోషల్ మీడియా మండల ఇంచార్జ్ వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
