ఇంటింటికి జోరుగా కాంగ్రెస్ ప్రచారం

రుద్రూర్, బతుకమ్మ: ఎమ్మెల్సి ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో   పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులందరూ అధికార పార్టీ మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అవగాహన కల్పించారు. ప్రజా ప్రభుత్వం పట్టభద్రులకు, విద్యార్థిని, విద్యార్థులకు ఒక నిబద్ధతతో హామీలన్నీ నెరవేరుస్తున్నందున మన ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు...