30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ పట్టభద్రుల ఓటుకు రూ.7 వేలు ఇస్తోంది

Must read

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ కు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువయ్యాడు

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :   పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుకు రూ.7 వేలు ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేరని వ్యాఖ్యనించారు. డబ్బుల వసూల కోసం రేవంత్ రెడ్డి ఎల్ ఆర్ ఎస్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కాంగ్రెస్  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజల కోసం కొట్లాడటమే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పట్టభద్రులను మోసం చేస్తోందని ఆరోపించారు.

More articles

Latest article