24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మార్చి 1న రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పరిశీలన

ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, బతుకమ్మ :  పసుపునకు మద్దతు ధర, బోనస్ కోసం మార్చి 1న రైతులతో కలెక్టరేట్ ముట్టడిద్దామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కవిత శనివారం సందర్శించారు. పసుపు ధర పై రైతులతో ఆమె మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్లో ఉన్న పసుపు పంటను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యాపారులు సిండికేట్ గా మరి పసుపు ధరను తగ్గించేశారన్నారు. పసుపు పంటకు 12 వేలు మద్దతు ధర, బోనస్ ఇవ్వాలని, డిమాండ్ చేశారు. రూ. 15 వేల మద్దతు ధర కోసం కేంద్రం పై పోరాటం కొనసాగుతుందన్నారు. గోదావరి నీటి దోపిడీ పై సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు గోదావరి నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని తరలించుకుపోనున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్,అలీం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article