మార్చి 1న రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం

వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పరిశీలన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్, బతుకమ్మ :  పసుపునకు మద్దతు ధర, బోనస్ కోసం మార్చి 1న రైతులతో కలెక్టరేట్ ముట్టడిద్దామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కవిత శనివారం సందర్శించారు. పసుపు ధర పై రైతులతో ఆమె మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్లో ఉన్న పసుపు పంటను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యాపారులు సిండికేట్ గా మరి పసుపు ధరను తగ్గించేశారన్నారు. పసుపు పంటకు 12...