25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌

Must read

📰 Generate e-Paper Clip

అస్వస్థతకు గురైన 80 మంది విద్యార్థులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌ జరిగింది. దీంతో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విషయం బయటికి రాకుండా సిబ్బంది డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించారు. విద్యార్థుల ఆరోగ్యం నయం కాకపోవడంతో విషయం బయటకు పొక్కింది. కేవలం 27 మంది విద్యార్థులు అస్వస్థతతో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. కానీ దాదాపు 80 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బయట ఫుడ్ తినడం వల్ల ఇలా జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు. కాగా, హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థులు తేల్చి చెప్పారు.

More articles

Latest article