కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో చర్చకు సిద్ధం
సవాల్ విసిరిన బండి సంజయ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువయ్యారని, దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు అవ్యడం తెలంగాణలోనే చూస్తున్నామని సెటైర్ వేశారు. కులగణన విషయంలో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుందని, ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలపారన్నారు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.
