29 C
Hyderabad
Monday, August 3, 2026

జేఏసీ అలుమ్ని క్లబ్ ఉత్తమ జేఏసీ సభ్యునిగా విజయానంద్ కు అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి

జేఏసీ అలుమ్ని క్లబ్ హైదరాబాద్ వారు నిర్వహించిన మిడ్ కాన్ఫరెన్స్ లో సెనేటర్ విజయానంద్ కు ఉత్తమ జేఏసీ సభ్యునిగా అవార్డ్ దక్కింది. ఈ అవార్డు ను జేఏసీ జాతీయ అధికారులు వినయ్ మెహత, మనోజ్ టక్కర్, జోన్ చైర్మన్ జీవీఎన్ రాజు , జోన్ అధ్యక్షులు గోవింద్ కంకాణిలు అందజేశారు. అనంతరం అవార్డు గ్రహిత విజయానంద్ మాట్లాడుతూ తాను చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించి జేఏసీ అలుమ్ని క్లబ్ ఉత్తమ జేఏసీ సభ్యుడిగా అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకముందు కూడా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తానని, తనకు సహకరించిన దాతలు హెచ్ ఓ యూఎస్ఏకు చెందిన కోరడా శ్రీలతకి, గుండు నరేష్ కు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ బోర్డు  సభ్యులు డీవీఎస్ప్ గుప్త, నవీన్ చావ్లా,విశాఖసమీర్,ఇందుర్ సభ్యులు లావణ్య , శ్రీహరి, ప్రసన్న పాల్గొన్నారు.

JAC Alumni Club Award to Vijayanand as Best JAC Member

More articles

Latest article