24 C
Hyderabad
Sunday, August 2, 2026

సోయా కొనుగోలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్థులో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్టు మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. నెల 15 రోజుల నుంచి మార్కెట్ యార్డులో పడి ఉన్న సోయా పంటను శుక్రవారం కొనుగోలు ప్రారంభించారు. జిల్లా అధికారి రమ్య సైతం రైతులతో చర్చలు జరిపి కొనుగోలు కేంద్రం ప్రారంభించారని వివరించారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ ఎండి ముజీబ్ సైతం కొనుగోలు కేంద్రంను సందర్శించారు. సోయ పంట ప్రారంభించేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి సోయా పంట కొనుగోలు చేయాలని విన్నవించారు. రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంట మార్కెట్ యార్డ్ కు తెచ్చి కొనుగోలు చేయకపోతే రైతులు మానసికంగా ఆర్థికంగా నష్టానికి గురయ్యారని ఎమ్మెల్యే కాంతారావు మంత్రులకు వివరించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడు వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తామని రైతులు అన్నారు.

More articles

Latest article