26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఖేలో ఇండియా విభాగంలో గోల్డ్ మెడల్   

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం :  ఖేలో ఇండియా ఉషు స్టేట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఆదిలాబాద్‌లో ప్రతిభ తక్కడపల్లి  45 కిలోల విభాగంలో బంగారు పథకం సాధించారు. ఛాంపియన్‌షిప్‌లో మొదటి బంగారు పథకం ఖరారు చేసుకున్నందుకు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.  దీనితో కామారెడ్డి జిల్లాకు ఒక పథకం ఖరారు అవ్వడమే కాదు, ఖేలో ఇండియా స్కాలర్‌షిప్‌కి ప్రతిభ ఎంపిక అయినట్లు నిర్వాహకులు చెప్పారు.  ప్రతిభ తక్కడపల్లి కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన రిపుల్స్  విద్యార్థినీలకు సబ్ జూనియర్ విభాగం లో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. తనకు సహకరించిన శ్రీరాముల సాయికృష్ణ వుషు కోచ్‌కి, తానా కోచ్ సతీష్ కు, తనకు స్పాన్సర్‌షిప్ అందించిన తన తండ్రి నర్సింగ్ రావుకు ప్రతిభా తక్కడపల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article