బీజేపీ నుంచి డిల్లీ సీఎంగా రేఖగుప్తా ప్రమాణస్వీకారం సందర్భంగా
నిజామాబాద్, బతుకమ్మ : బీజేపీ నుంచి డిల్లీ సీఎంగా రేఖగుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా లీగల్ సెల్, న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు.. జిల్లా కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవతున్న తీరుకు స్పందించిన ప్రజలు బీజేపీకి అధికారం అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎర్రం విఘ్నేష్ ,మానిక్ రాజు,బిట్ల రవి,వసంత్ రావు,పిల్లి శ్రీకాంత్,విఘ్నేష్ సతీష్ నాగ్ అంజలి,జయప్రకాష్ లోయ, రాజు కిషన్ రావు ,విక్రమ్ మొహమ్మద్ ఖాసిం, కిరణ్ శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు.
