బతుకమ్మ భిక్కనూరు: జల్సాలకు అలవాటు పడి బైకులను చోరీ చేస్తున్న దొంగలను మంగళవారం భిక్కనూరు పోలీసులు టోల్ ప్లాజా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. సీఐ సంపత్ కుమార్ వివరాలు ప్రకారం ఈరోజు టోల్ ప్లాజా సమీపంలో వెహికల్ చలాన్లు విధిస్తున్న సమయంలో షేక్ ఆఫ్రోజ్ షేక్ తోఫిక్ లను అనుమానం వచ్చి స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా బైకులను దొంగిలించినట్లుగా నేరం అంగీకరించారు.2 బైక్ లను సీజ్ చేసి వారిని జ్యూడిషియల్ రిమాండ్ కి పంపించడం జరిగిందన్నారు. ఇట్టి బైక్ దొంగతనాలను చేదించిన ఎస్సై భిక్కనూరు ఇబ్బంది అశోక్ సదయ్య రాజా గౌడ్ రాము శేఖర్ లను సిఐ సంపత్ కుమార్ అభినందించారు.
