25.5 C
Hyderabad

సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న వారినే గెలిపించండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ   :  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో కలలతో ఉద్యోగ ఉపాధ్యాయులుగా భవితను ప్రారంభించిన ఉపాధ్యాయులకు పిఎఫ్ ఆర్ డి ఏ అనే నూతన చట్టం ద్వారా పెన్షన్ విధానం అంధకారమయం చేసి ఆశలను ఆవిరి చేసిందని,ఇందుకోసం ఒక్కరైతే ఒంటరే…ఒక్కటైతే ఉప్పెనే అనే నినాదంతో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భద్రత భరోసాని తన బాధ్యతగా మొదలెట్టిన ఈ సిపిఎస్ వ్యతిరేక మహోద్యమ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి ఐదు రాష్ట్రాలలో పాత పెన్షన్ పునరుద్ధరణకు నాంది పలికిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా తాను ఎమ్మెల్సీగా భరిలో ఉన్నానని,తనను గెలిపిస్తే తప్పకుండా సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు పాటుపడతానని, ఉపాధ్యాయ,ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ లలో తనను ఓటు ద్వారా గెలిపించుకుని సిపిఎస్ మహమ్మారిని అంతం చేసే మరో అడుగు దూరంలో ఉన్నామని ప్రతి ఒక్కరూ నూటను తమ బాధ్యతగా భావించి తనను గెలిపించాలని తప్పకుండా నిరుద్యోగ,ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.

More articles

Latest article