27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్

నిజామాబాద్, బతుకమ్మ :  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు  యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈమేరకు ఆదివారం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి సంతాప సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈసభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్యవక్తులుగా హాజరవుతున్నారన్నారు. ఈసంతాప సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, విప్లవాభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఈకార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సీహెచ్ సాయన్న, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్కగణేష్, టీయూసీఐ జిల్లా నాయకులు విఠల్, కిరణ్, సీఎల్సీ జిల్లా నాయకులు జలందర్ పాల్గొన్నారు.

More articles

Latest article