29 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య యాజమాన్యం టీచర్ల పైన దురుసుగా ప్రవర్తిస్తుందని ఆయన అన్నారు. అలాగే ఒకరోజు ఏజీఎం సతీష్ లేడీ టీచర్లను మీటింగ్ కు పిలిచి అడ్మిషన్స్ రావడంలేదని లేడీ టీచర్ల పైన అసభ్యకరంగా మాటలు మాట్లాడాడని తెలిపారు. శ్రీ చైతన్య లో పనిచేస్తున్నటువంటి లేడీ టీచర్లు ఎవరికి చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీ చైతన్య గుర్తింపును రద్దు చేయాలని, అలాగే శ్రీ చైతన్య ఏజీఎం సతీష్ ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. లేనియెడల డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టీజీవిపి జిల్లా కార్యదర్శి నవీన్, కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎండి సమీర్ ఖాన్, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Burning effigy of Shri Chaitanya AGM Satish

More articles

Latest article