28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్జిటిల సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : ఎస్జిటిల సమస్యలు పరిష్కరించాలని ఎస్జీటీయూ ఆధ్వర్యంలో శనివారం ఎంఈఓ కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుల గణన సర్వే సిసిఎల్ ప్రొసీడింగ్,గత సంవత్సరం వేసవి సెలవుల్లో ఓపెన్ ఎస్ ఎస్ సి ఇన్విగిలేషన్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయుల ఈ ఎల్ ఎస్ ప్రోసిడింగ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుండి ఎటువంటి అధికారిక ప్రొసీడి0గ్ రిలీజ్ అయిన అది ఎంఆర్సి నుండి విడుదల కావాలని, ఏ ఒక్క నాయకుని ఇంటి నుండి విడుదల కావద్దని కోరారు. ఉపాధ్యాయులు సరెండర్ చేసిన ఈ ఎల్ ఎస్ విషయంలో పర్సంటేజ్ ఇస్తే బిల్స్ త్వరగా చేయించడం జరగుతుందని అన్నారు. ఎంఈఓ సానుకూలంగా స్పందించి వీలయినంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీటీయు జిల్లా కార్యదర్శి విజయ్ పటేల్,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేఖ్ ఖయ్యూమ్ – టీ మారుతి,ఉపాధ్యక్షులు చాంద్ పాషా,జాదవ్ రవి పాల్గొన్నారు.

More articles

Latest article