24.1 C
Hyderabad
Monday, August 3, 2026

’రాజాసింగ్ మంచోడు.. ఆయనను రెచ్చగొట్టొద్దు‘

Must read

📰 Generate e-Paper Clip

కేంద్ర మంత్రి బండి సంజయ్

వెబ్ న్యూస్, బతుకమ్మ: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంచోడని, ఆయనను రెచ్చగొట్టొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. బీజేపీలో బీసీలకు చోటు ఎక్కడుందని ? స్టేట్ ప్రెసిడెంట్ ఒక రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి, మహిళా మోర్చా కూడా రెడ్డినే అని  సొంత పార్టీపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈవ్యాఖ్య లపై బండి సంజయ్ స్పందించారు. ఓ వ్యక్తి కోసం పార్టీ నిబంధనలు మార్చరని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. రాజాసింగ్ బాధ పడి ఉండొచ్చు నేను కాదనను అని పేర్కొన్నారు. కాగా, రాజా సింగ్ చేసిన వ్యాఖ్య లు బీజేపీలో చర్చనీయంశంగా మారాయి.

More articles

Latest article