29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వర్క్ ఫ్రం హోం పేరిట మోసం

Must read

📰 Generate e-Paper Clip

. రూ.2.35 లక్షలకు కుచ్చు టోపీ

. వారం రోజుల్లో మూడు సైబర్ కేసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన జ్యోతి కి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రం హోం జాబ్ ఉందంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన జ్యోతి వారికి ముందస్తుగా రూ.2.35లక్షలు చెల్లించింది. ఆ తరువాత ఎదుటి వ్యక్తుల నుంచి ఎటువంటి రెస్ఫాన్స్ లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసలుకు ఫిర్యాదు చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడు సైబర్ కేసులు నమోదయ్యాయి. 

More articles

Latest article