. . . ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధూశర్మ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన , సహకరించిన , అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై మొత్తం 31 కేసులు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 13 కేసులు , ఆర్మూర్ డివిజన్ పరిధిలో 13 కేసులు , బోధన్ డివిజన్ పరిధిలో 05 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా , ఇసుక అక్రమ రవాణా చేసినట్లు మీకు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 08462 226090 కు ( లేదా ) డయల్ 100 కు ఫోన్ చేసి తెలుపగలరు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచ బడును అని సిపీ తెలిపారు.
