27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ కేసులో పంచాయతీ కార్యదర్శి కి ఏడాది జైలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

లంచం తీసుకున్న కేసులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కి నాంపల్లి ఎసిబి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిజామాబాద్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డే నర్సింహులు అతని తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తమ సోదరుల పేరు  మీదకు బదలాయించాలని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. నర్సింహులు వద్ద కోటగిరి పంచాయతీ కార్యదర్శి  జి . సుధర్శన్ 10 వేల లంచం డిమాండ్ చేశారు.  లంచం ఇవ్వడం ఇష్టం లేని నర్సింహులు ఎసిబిని ఆశ్రయించారు. 2014 ఫిబ్రవరి 21న నర్సింహులు నుంచి  రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన సుధర్శన్ పై శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఎసిబి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ తమ తీర్పు వెలువరించారు. లంచం తీసుకుంటూ దొరికిన అనాటి కోటగిరి  పంచాయతీ కార్యదర్శి జి సుదర్శన్ కు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా , మరో సెక్షన్ లో రూ.20 వేల  జరిమానా విధించారు. మొత్తంగా ఏడాది కాలం జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమానా చెల్లించాలని లేని యెడల ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కోన్నారు.

More articles

Latest article