27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డి బల్దియాలో ఇంటి నంబర్ల దందా

Must read

📰 Generate e-Paper Clip

  • ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ ల కేటాయింపు
  • హౌస్ నెంబర్ లతో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు                                              
  • అటువైపు చూడని రెవెన్యూ అధికారులు       

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న రెవెన్యూ భూముల్లో భూ కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుండి శివారు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములపై భూకబ్జాదారులు కన్నేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నగర పంచాయతీ నుంచి బల్దియాగా అప్ గ్రేడ్ అయినది మొదలు అవినీతి అక్రమాలకు ఎల్లారెడ్డి బల్దియా కేరాఫ్ గా మారింది. 12 వార్డులతో 2020 లో కొత్త మున్సిపాల్టీగా ఎర్పడిన తరువాత కొత్త పాలకవర్గం ఏర్పడింది. ఐదేళ్లలో అక్కడ పాలకులు అక్రమార్కులకు అండగా నిలిచారు. ఎల్లారెడ్డి బల్దియా పరిధి చుట్టూరా ఉన్న గొలుసు కట్టు చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దేవుడి మాన్యాన్ని కూడా వదల్లేదు అక్రమార్కులు. వారికి మున్సిపల్ అధికారుల అండదండాలు, నేతల అండతో మున్సిపాల్టీలో ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయి. ఖాళీ జాగాలకు ఇంటి నెంబర్లు తీసుకోవడం వాటితో వార్డు బ్లాక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా తీసుకున్న ఆస్థిపన్నుల ద్వార ఇంటినెంబర్ లు పొంది రిజిస్ర్టేషన్ లు చేసే దందా జరిగింది. ప్రభుత్వం సెల్ఫ్ అసెస్మేంట్ ప్రక్రియకు బ్రేక్ వేసిన దాని ద్వార జరిగిన ప్రభుత్వ భూములలో, నాన్ లే అవుట్ ప్లాట్ల దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ పరిధిలోని 12వార్డు పరిధిలోని బీడీ కాలనీ పక్కన సర్వే నంబర్ 693లో లక్షల విలువైన భూమి లో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో హౌస్ నంబర్లు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నిజమైన లబ్ధిదారులకు అనుమతులు ఇవ్వడం లేదని, అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

More articles

Latest article