ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి లోవోల్డేజ్ ప్రాబ్లం ఉండడం వలన గురువారం కొత్త ట్రాన్స్ఫార్మర్ 100 కేవి ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ శ్రావణ్ కుమార్, ఎల్లారెడ్డి డీఈ విజయ సారధి, ఏఈ వెంకటస్వామి, లైన్స్పెక్టర్ జగదీశ్వర్, సీనియర్ లైన్స్పెక్టర్ సితేందర్ రెడ్డి, లైన్మెన్ శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
