పోతంగల్, బతుకమ్మ : పోతంగల్ మండలంలోని కోడిచెర్ల గ్రామ శివారులో గురువారం అక్రమంగా డంప్ చేసిన 38 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. డీడీ కట్టిన వారికి ప్రభుత్వ పనుల కోసం కేటాయిస్తామని తెలిపారు. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

