27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించం : బండి సంజయ్

Must read

బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్సే

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు

మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా?

 డిల్లీ, బతుకమ్మ :  బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ’మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వం. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదని తేటతెల్లమైంది. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోంది. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం తథ్యం. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుంచి ముస్లింలను తొలగించాల్సిందే. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే. ఇచ్చిన మాట తప్పుతూ బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్సే. బీసీలంతా కాంగ్రెస్ మోసాలను గుర్తించాలని కోరుతున్నా. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా?. 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదు. 73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా?. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు…. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలి. సర్పంచ్ లేకుంటే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదెలా?. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా?. ఓడిపోతామనే భయానికే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు‘ అని ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article