బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించం : బండి సంజయ్
బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్సే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా? డిల్లీ, బతుకమ్మ : బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ’మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వం. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదని తేటతెల్లమైంది. బీసీల్లో ముస్లింలను...