. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు
హైదరాబాద్, బతుకమ్మ: కోడి పందేలు, క్యాసినో నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ తోపాటు సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండల తొల్కట్ట ఫామ్ హౌస్ లో క్యాసినో, కోడి పందేలు ఆడుతున్న 64 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.30 లక్షల నగదు, 55 కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
