29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య

 

బోధన్, బతుకమ్మ : తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య అన్నారు. బోధన్ పట్టణంలోని ఎంపీఆర్  బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రకమంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ జిల్లాల బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు, పీఆర్సీ, డిఎలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారి హక్కులను కాలరాశాయన్నారు. అంతేకాకుండా మోడల్ స్కూల్స్ టీచర్స్ కి హెల్త్ కార్డ్ ఇవ్వకుండా, పార్ట్ టైమ్  కాంట్రాక్టు టీచర్స్ కి ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా, కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే సాధారణ సెలవులు, అనారోగ్య సెలవులు, సంపాదిత సెలవులు మంజూరు చేయకుండా, ప్యానల్ గ్రేడ్ హెచ్. ఎం.లకు జీరో సర్వీస్ బదిలీలు  పదోన్నతులు కల్పించకుండా గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోకుండా, జీఓ 317 బాధితులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని మనం చూస్తూనే ఉన్నామన్నారు. అలాగే జీతాలు ఇవ్వకుండా, పీఆర్సీలు, డీఏ లు ఇవ్వకుండా టీచర్స్ ని అరిగోసలపాలు చేసిన కేసీఆర్ పాలనను కూడా అనుభవించామన్నారు. ప్రస్తుతం  తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వల్లనే అనేది సుస్పష్టం అన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్రం నుండి తొమ్మిది లక్షల కోట్లు మన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీ ఖర్చు చేశారని తెలిపారు. కేంద్రం నిధులతో 736 కేజీబీవీ స్కూల్స్, 44 కేంద్రీయ విద్యాలయాలు, 9 నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. కొత్తగా మరో 7 నవోదయ విద్యాలయాలు కేటాయించి, వేలాదిమంది టీచర్లకు ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, జిల్లా, నియోజకవర్గంలోని ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Efforts will be made to solve the problems of the education sector

More articles

Latest article