24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 కామారెడ్డి జిల్లా కలెక్టర్  బిచ్కుంద లో సుడిగాలి పర్యటన 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద కేంద్రంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సుడిగాలి పర్యటనను నిర్వహించి పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఐటిఐ కళాశాలను సందర్శించి వసతులు వనరుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే వృత్తివిద్య కోర్సుల్లోనూ విద్యార్థులు ప్రతిభను కనబరుస్తూ జీవితంలో రాణించాలన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజన వ్యవస్థను పరిశీలించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా “నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద” అంటూ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే రైతు వేదిక వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీలను వెంటనే పరిశీలించి రైతులకు తగు న్యాయం జరిగే విధంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Kamareddy District Collector Bichkunda toured the whirlwindఅక్కడినుండి నేరుగా వంద పడకల ఆస్పత్రిని సందర్శించి ,రికార్డులను పరిశీలించారు, వైద్య సిబ్బంది 24 గంటలు వైద్య ఆసుపత్రిలో ప్రజలకు రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని కలెక్టర్ కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని అన్నారు. సిబ్బంది కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. వర్షాకాలం ప్రారంభమైన0దున గ్రామాల్లో ఎలాంటి వ్యాధులు వ్యాపించకుండా దోమల మందు తో పాటు బ్లీచింగ్ పౌడర్ అలాగే పరిసరాల పరిశుభ్రత గ్రామాలలో మురుగునీటి కాల్వలుశుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలని కోరారు. అనంతరం ఏం ఎల్ ఎస్ పాయింట్ ను సందర్శించి గోదామును మొత్తం తిరిగి పరిశీలించారు, రికార్డులను మొత్తం చెక్ చేసి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు మండల తాసిల్దార్ సురేష్, మరియు మండల స్థాయి అధికారులతో పాటు ఐటిఐ కళాశాల, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Kamareddy District Collector Bichkunda toured the whirlwind

More articles

Latest article