26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కుంభమేళా నుంచి తిరిగి వస్తూ.. మృత్యు ఒడిలోకి..

Must read

📰 Generate e-Paper Clip

ఏడుగురు మృతులు హైదరాబాద్ వాసులు

జబల్ పుర్, బతుకమ్మ :  యూపీలోని ప్రయాగ్ రాజ్  కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. ఈఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో చోటుచేసుకుంది.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన కొందరు యాత్రికులు మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో జబల్ పుర్ లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 14 మంది ఉన్నారు. మృతులను హైదరాబాద్ లోని నాచారం వాసులుగా గుర్తించారు.

More articles

Latest article