- పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే, పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ చైర్మన్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : డిచ్ పల్లి గ్రామంలోని ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సాధరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిచ్ పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.

