30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చాకు నికాలే

Must read

📰 Generate e-Paper Clip

  • గొడవలో కత్తులు దూసిండ్రు

 

నిజామాబాద్ క్రైం , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కత్తులు దూసిండ్రు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నగరంలోని ఆరో టౌన్ పరిధిలోని ఆటోనగర్ లో చోటుచేసుకుంది. చిన్న గొడవ విషయంలో తలెత్తిన వివాదంలో యువకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో ఆటోనగర్ దయా బ్రిడ్జి వద్ద  మజీద్ ఏ  ఆయేషా ప్రాంతంలో రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఖాజా చికెన్ నిర్వాహకులు సెంటర్ షేక్ జమీల్, అబ్దుల్ రెహమాన్ లు చాకులు తీసారు. ఈ విషయంలో ఫెరోజే అనే యువకుడు చంపుతామని బెదిరించాడని స్థానిక ఆరవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నగరంలో కత్తులు కలిగి ఉండడం ఫ్యాషన్ గా మారింది. చిన్నా చితక గొడవలకే కత్తులు చూయించి బెదిరించడం రివాజుగా మారుతుంది. పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Chaku Nikale

More articles

Latest article