30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో  ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఏర్గట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యుడు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పన్నాల నర్సరెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మినుముల సాగర్ లు లబ్ధిదారుకి అందచేసారు.ఈ సందర్భంగా లబ్ధిదారు మాట్లాడుతూ దవాఖాన బిల్లులను స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ద్వారా బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లిని వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు మంజూరు చేయించారన్నారు. కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంగెం నడిపి గంగాధర్, ఏనుగంటి స్వామి,అరపు రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article