29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

స్మశాన వాటికను కబ్జా చేసిన వారీపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని 13 వ డివిజన్ డెయిరీ ఫాం సమీపంలోని ఎస్సీ, ఎస్టీ ల స్మశాన వాటికను కబ్జా చేసే ప్రయత్నంలో కొందరు భూకబ్జాదారులు శంషాన్ ఘాట్‌ను చదును చేసి సమాధులను ధ్వంసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని మజ్లీస్ పార్టి జిల్లా అధ్యక్షులు పయాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. నగరంలోని అర్సపల్లికి చెందిన నవిన్ అను వ్యక్తి తమకు పట్టాలు ఉన్నాయని బోందల గడ్డను చదును చేసి , సమాధులను ధ్వంసం చేశారని ఎస్సీలు తమకు పిర్యాదు చేశారని ఎంఐఏం పార్టి మాజీ డిప్యూటి మేయర్ మీర్ మజాజ్ తెలిపారు.శ్మశాన వాటిక కూల్చివేతకు పాల్పడిన భూకబ్జాదారులందరిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షకీల్‌ అహ్మద్‌ ఫాజిల్‌ , టౌన్‌ జనరల్‌ సెక్రటరీ ఎండీ షాబాజ్‌, జాయింట్‌ సెక్రటరీ ఐజాజ్‌ హుస్సేన్‌,మాజీ కార్పొరేటర్‌ మీర్‌ ఇర్షాద్‌, మజీద్‌ అలీ సామ్‌, రియాజ్ అహ్మద్, అఫ్సర్ బేగ్, మహ్మద్ ముస్తా ఔర్ సిన్ ఖలీల్ అహ్మద్, అమర్ ఫరూఖ్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ బాధ్యులు ఉన్నారు.

Action should be taken against those encroaching on the graveyard

More articles

Latest article