స్మశాన వాటికను కబ్జా చేసిన వారీపై చర్యలు తీసుకోవాలి

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 13 వ డివిజన్ డెయిరీ ఫాం సమీపంలోని ఎస్సీ, ఎస్టీ ల స్మశాన వాటికను కబ్జా చేసే ప్రయత్నంలో కొందరు భూకబ్జాదారులు శంషాన్ ఘాట్‌ను చదును చేసి సమాధులను ధ్వంసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని మజ్లీస్ పార్టి జిల్లా అధ్యక్షులు పయాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. నగరంలోని అర్సపల్లికి చెందిన నవిన్ అను వ్యక్తి తమకు పట్టాలు...