25.3 C
Hyderabad

ఇస్లామిక్ జల్సా కరపత్రాల విడుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : ఈనెల 20న మండలకేంద్రంలో గల మస్జిదే ఆబేదీన్ లో రంజాన్ ప్రారంభపు ఇస్లామిక్ జల్సా నిర్వహిస్తున్నట్లు మస్జిదే ఆబేదీన్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం మస్జిద్ ఆవరణలో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజ్రత్ మౌలానా అర్షద్ అలీ ఖాస్మి, మౌలానా వాజియోద్దీన్ ఖాస్మి వస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని, నిత్యం భక్తి మార్గంలో నడవాలని అదేవిధంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఏవిధమైన ఆచారాలను పాటించాలో సుధీర్ఘంగా వివరిస్తారని అన్నారు. పెద్దమొత్తంలో ప్రతీ ఒక్కరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు.ఈ ఇస్లామిక్ జల్సా సాయంత్రం 6 నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సదర్ గులామ్ అహ్మద్, హామెద్ మౌలానా, నిసార్, లయాఖ్, ముజాహిద్, మహబూబ్ మౌలానా, హాఫిజ్ మోసీన్, అహ్మద్, హాఫిజ్ అయ్యూబ్, కలీమ్, రబ్బానీ మౌలానా, హాఫిజ్ సమద్ మరియు కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article