ఇస్లామిక్ జల్సా కరపత్రాల విడుదల
బతుకమ్మ, బిచ్కుంద : ఈనెల 20న మండలకేంద్రంలో గల మస్జిదే ఆబేదీన్ లో రంజాన్ ప్రారంభపు ఇస్లామిక్ జల్సా నిర్వహిస్తున్నట్లు మస్జిదే ఆబేదీన్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం మస్జిద్ ఆవరణలో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజ్రత్ మౌలానా అర్షద్ అలీ ఖాస్మి, మౌలానా వాజియోద్దీన్ ఖాస్మి వస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని, నిత్యం భక్తి మార్గంలో నడవాలని అదేవిధంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఏవిధమైన ఆచారాలను...