27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉద్యోగుల కోసం పిఆర్సి అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ:  రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించి 30శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతు శంతన్ డిమాండ్ చేశారు. బుధవారం నందిపేట మండలంలోని పలు  పాఠశాలలు సందర్శించిన ఆయన, గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, జిల్లా ఉపాధ్యక్షుడు రాసరి పెంటన్న ఎఫ్‌ఏసీ ఎంఈఓల నియామకాన్ని రద్దు చేసి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని డిమాండ్ చేశారు.

PRC should be implemented for employees

More articles

Latest article