24 C
Hyderabad
Sunday, August 2, 2026

తోటపై టాస్క్ ఫోర్స్  దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

 

ఆర్మూర్, బతుకమ్మ : వ్యవసాయ తోటలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ,  సిసిఎస్ సిబ్బంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  పీసీ భోజన్నతోటపై మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.  పేకాట స్థావరం పై రైడ్ చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, రూ.21960 నగదు స్వాధీనం చేసుకొన్నారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు.

More articles

Latest article