బతుకమ్మ, ఆర్మూర్ : రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామంలోని లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ ఎంపీటీసీ కాటిపల్లి నర్సారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, సైకిల్ టెక్స్ అక్బర్, డిస్ రాజు, జీతేందర్ నాయక్, ఎంఓ మోతె సాయిలు, నట్టా తిరుపతి, బుస శ్రీధర్, సోప్పరి సుధీర్, గన్న జనార్దన్, మున్సాఫ్ గన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
