29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నవీపేట్ మండలం లోని హనుమాన్ ఫారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ గ్రామానికి చెందిన సగ్గు సాయన్న (74) మృతి చెందాడు. స్థానిక ఎస్సై సమాచారం మేరకు కిర్గుల్ గ్రామానికి చెందిన సగ్గు సాయన్న తన కొడుకు సుభాష్ తో కలిసి మాక్లూర్ మండలం గుంజలి గ్రామానికి తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో నవీపేట్ మండలం హనుమాన్ వద్ద అతివేగం కారణంగా మూలమలుపు వద్ద మోటార్ సైకిల్ రోడ్డు ప్రక్కన గల కల్వర్టు కు ఢీకొని కింద పడడంతో తీవ్ర గాయాలతో సాయన్న మృతి చెందగా, సుభాష్ కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతుని మనవడు సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై వినయ్ తెలిపారు.

More articles

Latest article