26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బకాయి వేతనాలు చెల్లించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుంబంధ సంస్థ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రామ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పి.బాలరాజ్, మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్. దశరథ్ మాట్లాడారు.శ్రీ గణేష్ ఏజెన్సీ వారి నుండి నాలుగు నుండి ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇల్లు గడవలేని పరిస్థితి ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా కోరారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article