29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం తరపున మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టులో కస్తూర్బా గాంధీ స్కూల్ ఏర్గట్ల కు చెందిన శ్రీనిధి, ప్రథమ బహుమతి,జడ్ పి హెచ్ ఎస్ తడపాకల్ కు చెందిన కుల్షన్ కు ద్వితీయ బహుమతి, జడ్ పి హెచ్ ఎస్ ఏర్గట్లకు చెందిన అస్నిహాభాను, పూజిత తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి టాలెంట్ టెస్ట్ లో పాల్గొనడం వల్ల వారిలోని ప్రతిభను గుర్తించవచ్చని, జిల్లా స్థాయిలో కూడా మన ఏర్గట్ల మండలానికి బహుమతి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు రాజశేఖర్, సుధాకర్, విఘ్నరాజ్ ,రవి, వినోద్, స్రవంతి పాల్గొన్నారు.

More articles

Latest article