24 C
Hyderabad
Sunday, August 2, 2026

స్త్రీ నిధి రుణాలు పారదర్శకంగా వసూల్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  పాస్ మిషన్స్ లను స్లం ( ఏరియా లెవెల్ ఫెడరేషన్) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. రాష్ట్రం లోని మొదటి సారిగా స్లం  సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  స్త్రీ నిధికి సంబంధించిన ఋణాలు సులభంగా, పారదర్శకంగా, బ్యాంకులకు వెళ్ళనవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాస్ మేషిన్స్ ద్వారా ఋణాలు వంద శాతం సకాలంలో చెల్లించాలని సమైఖ్య ప్రతినీధులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమైఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Shri Nidhi loans should be collected transparently

More articles

Latest article