29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ కౌన్సిలర్ ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో జిలిటెన్ స్టిక్స్ బయటపడడం కలకలం రేపింది. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భర్త నర్సుగొండ తన ప్లాట్లో బండ రాళ్లను తొలగించడానికి 40 జిలెటిన్ స్టిక్స్ , పౌడర్ పేలుడు పదార్థాలను ఉపయోగించడానికి సిద్ధం చేశాడని పోలీసులకు సమాచారం వచ్చింది.దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బండగల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా బండరాళ్లను పగులగొట్టడానికి ఉపయోగించడానికి సిద్ధం చేశారని సీఐ అశోక్ తెలిపారు. నర్సుగొండపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ అశోక్ తెలిపారు.

More articles

Latest article