28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రీడా దుస్తులు వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ : మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాల లో బుధవారం విద్యార్థులకు పీఎసీఎస్ చైర్మన్ లింబారెడ్డి చేతుల మీదుగా క్రీడా దుస్తులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రములో లింబారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడాదుస్తులను అందించిన యువరైతు బాక్సింగ్ అకాడమి చైర్మన్ కనూర్ సంజీవ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మల్లేష్, మాజీ ఎంపీటీసీ రవి, సంతోష్ మారుతి, చిన్నారెడ్డి రమేష్, సతీష్ వాకర్స్ అసోషియేషన్ సభ్యులు ఉపాధ్యాయులు రాధ,ఓంకార్, కృష్ణవేణి    పాల్గొన్నారు.

More articles

Latest article