మద్నూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం రోడ్డు భద్రత వార్షికోత్సవాలల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పిల్లలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తే ఇంట్లో తెలియజేస్తారనే ఉద్దేశంతో పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నట్లు ఏఎంవీఐ తెలిపారు. విద్యార్థులు తప్పకుండా రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన పరీక్షలో ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకరయ్య, కానిస్టేబుల్ గంగామణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
