- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ : భారత దేశానికి దిక్సూచి రాజ్యాంగమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని తెలిపారు. రైతు సోదరుల పెట్టుబడికోసం ప్రభుత్వం రైతుభరోసా కింద ఎకరాకు 12 వేల రూపాయలు సంవత్సరానికి అందచేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బిర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, ఆయా మండలాల ఎమ్మార్వో, ఎంపీడీఓ లు,ఇతర అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

