29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ప్రజాపాలన

Must read

📰 Generate e-Paper Clip

  • నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రం లో ప్రజపాలన ప్రభుత్వం నడుస్తుందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా వద్ద నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహాన్ని గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే సి. ఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను నిర్వహిస్తున్నారని తెలిపారు. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందన్నారు. సకల జనుల హితం కోరుతు తెలంగాణాలో ప్రగతి పథం వైపు ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Public administration according to Ambedkar's ambitions

More articles

Latest article